Logo
Date of Publish : 12 November 2022, 4:19 pm
Editor : Sake Naresh

ఇది జగనన్న ఇళ్ల పథకంలా లేదు… ఇల్లు గుల్ల పథకంలా ఉంది : వాసగిరి మణికంఠ

         గుంతకల్ ( జనస్వరం ) : జగనన్న కాలనీల పేరట ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు బండి శేఖర్ అధ్యక్షతన "జగనన్న ఇల్లు- పేదలందరికీ కన్నీళ్లు" అనే కార్యక్రమం ద్వారా గుంతకల్ పట్టణం ధోని ముక్కల రోడ్డులో గల జగనన్న కాలనీ, టిక్కో ఇళ్ల సముదాయాలను సామాజిక పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలతో గుంతకల్ లోని జగనన్న కాలనీలని పరిశీలించి ప్రస్తుత పరిస్థితి గురించి తీసిన ఫోటోలు, వీడియోలను డిజిటల్ మీడియాలో #JaganannaMosam జగనన్నమోసం అనే హ్యాష్ టాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వ తీరును ఎండకడతామని తెలిపారు. పేదలందరి ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు.

జగనన్న కాలనీలో భూసేకరణ పేరుతో దోపిడీ...

    రాష్ట్రవ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ 10 నుంచి రూ 20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని 70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూ 23,500 వందల కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి. అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు అనేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. ఈ ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుక మాత్రమే ఉచితంగా అందిస్తుంది అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండిషన్ పెట్టింది. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడా నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదు అని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు కేవలం 5% ఇళ్లను కూడా కూడా నిర్మించలేదు. ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చింది, పేదలను ఎందుకింత దగా చేస్తున్నారు, ప్రజలకు ఈ వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ప్రధానంగా డిమాండ్ చేశారు. జగనన్న ఇల్లు పేరిట గత మూడున్నరఏళ్లగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉంది. 2020లో పులివెందుల, కాకినాడ, విజయనగరంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు పైలాన్ వేశారు. గడువు దాటిన ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో టిక్కో ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్టర్ చేయడం లేదు. ఇళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక పేదలు చితికి పోతున్న ఇళ్లను మాత్రం కేటాయించడం లేదు. ఇది జగనన్న ఇళ్ల పథకంలా లేదు.. ఇల్లు గుల్ల పథకంలా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టిక్కో ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పిన మాట ఈ ముఖ్యమంత్రి కి గుర్తుందా? లేక ప్రజలే గుర్తు చేయాలా చెప్పండి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవ యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు జనార్ధన్, హనుమంతు వీర మహిళలు బండి చంద్రకళ, ఈరమ్మ, కుమారి, లలిత, క్రియాశీలక సభ్యులు, జనసైనికులు దాదు, ఆటో రామకృష్ణ, మంజునాథ్, అనిల్ కుమార్, రామకృష్ణ, అంజి, బద్రి, సుంకన్న, మోహన్, విజయ్, అనిల్, లారెన్స్, వంశి, చికెన్ మధు, లచ్చి, చక్రవర్తి, రామన్న, రవి, రంగన్న, ఆంజనేయులు, ఏ.సుంకన్న, జి.సుంకన్న తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com