అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గం మాదాల పంచాయతీ పరిధిలో గల నంది వలస ( పి టి జి ) మోడల్ కాలనీ వీధిలో విద్యుత్ స్తంభాల పరిష్కారాన్ని ఐటిడి పిఓ హామీ ఇచ్చినట్టు జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా, దురియా శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదల పంచాయితీ నందివలస( పిటిజి ) మోడల్ కాలనీ గ్రామంలో ఇటీవల జనసేన పార్టీ ఆయా గ్రామంలో పర్యటనలో భాగంగా గ్రామస్తులతో సమావేశమైన సందర్భంలో ఆయా గ్రామంలో విద్యుత్ స్తంభాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు జనసేన పార్టీ దృష్టికి తీసుకొని రావడంతో పాటు, పలుమార్లు అధికారులు దృష్టికి పెట్టినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన జనసైనికులు నేడు పాడేరు ఐటీడీఏ పిఓ గారిని కలిసి తక్షణమే ఆయా గ్రామంలో విద్యుత్ స్తంభాలు కల్పించి, విద్యుత్ సౌకర్యం కల్పించగలరనివినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఐటిడిఏ పిఓ గారు తన సొంత నిధులతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.