Logo
Date of Publish : 29 March 2026, 9:31 pm
Editor : Sake Naresh

బీసీలకు తోడ్పాటును అందించింది టిడిపి పార్టీనే : చింతమనేని

దెందులూరు, మార్చి 29 (జనస్వరం) : బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పాటును అందించింది తెలుగుదేశం పార్టీనేనని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన నేటూరి గోపాలకృష్ణను ఎమ్మెల్యే ప్రభాకర్ శాలువా తో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి బీసీలు వెన్నుముకగా ఉన్నారన్నారు. జిల్లాలో తొమ్మిది లక్షల పైబడి బీసీ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారని వారందరి అభివృద్ధికి తగిన సహకారాన్ని అందిస్తూ ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పన, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పాటుపడాలని సూచించారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేటూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీల పట్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దశగా కష్టపడి పని చేస్తానని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని సూచనల మేరకు మరింత అభివృద్ధి దిశలో పాటుపడతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు కార్యదర్శి గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతమనేని విష్ణు, రాంప్రసాద్ ,టిడిపి నాయకులు విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ శివశ్రీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com