నెల్లిమర్ల ( జనస్వరం ) : మండలం వైసీపీ సీనియర్ నాయకులు గదల అచ్చిం నాయుడు గారు వైసీపీని వీడి జనసేన పార్టీలోకి చేరిక. పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీమతి లోకం మాధవి గారు. జనసేన తెలుగుదేశం భాజపా నెల్లిమర్ల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి జనసేనలోకి వైసీపీ నుండి భారీ చేరికలు మొదలయ్యాయి. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ పంచాయతీ మొదటి నుండి వైసీపికి కంచుకోటగా ఉంది. రెండో పార్టీ ఆ ప్రాంతంలో జండా పట్టుకుని తిరగాలన్నా, నామినేషన్ వేయాలన్నా, వైసీపీ నాయకుల బెజరింపులకి, కక్ష సాధింపు చర్యలకు వెనుకంజ వేసేవారు. అలాంటి ప్రాంతంలో జనసేనకి ఒక బలమైన పునాది శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన చేరిక ఒక నిదర్శనం. దీంతో నియోజకవర్గమంతటా జనసేన పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తూ అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తుంది. లోకం మాధవి గారు వేస్తున్న ఎత్తుగడలకి ప్రత్యర్థులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.