Logo
Date of Publish : 31 December 2023, 8:39 pm
Editor : Sake Naresh

మదరసా మునర్వా సంస్థకు ఆర్థిక సాయం అందించిన జానీ మాస్టర్

    నెల్లూరు ( జనస్వరం ) :  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి మదరసాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిందని జనసేన నాయకులు అన్నారు. పలుమార్లు ప్రభుత్వ అధికారులకు గుర్తు చేసినా లెక్క చేయక మధురాసాల నిర్వీర్యానికి కారణం అవుతుందన్నారు.  జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ద్వారా తెలుసుకొని నెల్లూరు రూరల్ లోని మధురసా ఈ మన్వర్ సంస్థకు తొలితగా 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మదరసాను యధావిధిగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేటట్లు ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేను చేసిన ఆర్థిక సాయం పెద్దది కాకపోవచ్చు... ఈ విధంగానైనా ప్రభుత్వానికి మదరసాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ అనాదిగా అనాదిగా మతాచారంగా భావిస్తున్న మదరసాలకు ప్రభుత్వం అందించాల్సిన నిధులను కేటాయించి ముస్లింల మనోభావాలు దెబ్బతియ్య వద్దని గుర్తు చేస్తున్నాను... అనాదిగా మతాచారాలకు పాటిస్తూ నడుపుతున్న మధురసాలను నిర్వీర్యం చేయడం తగదు... ఎవరి మతం వారికి గొప్ప. గత ప్రభుత్వాలు ఎంతోకాలంగా మదరసాల కు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. అనాదిగా ముస్లింలు మదరసాల చదవడం గొప్పగా భావిస్తూ... కొంతమంది వాటిలోనే చదివించటం ఆచారంగా ఉంది. వాటికి ప్రభుత్వ సహకారం దశాబ్దాలుగా నడుస్తుంది.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి వాటి నిర్వహణకై ఖర్చును శాలరీలను మిడ్ డే మీల్స్ కు అవసరమైన నిధులను సమకూర్చకుండా వాటిని నిర్వీర్యం చేయాలని చూడడం సమంజసం కాదు. ప్రజాస్వామిక దేశంలో ఎవరి ఎవరి మతాలను స్వేచ్ఛగా ఆచరించవచ్చు అటువంటిది ప్రత్యేకంగా మదరసాలను నిర్లక్ష్యం చేయడం తగదని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోయినా ఎప్పటినుంచో కొనసాగుతున్న మదరసాల నిర్వహణ నిధులు ఆపటం సమంజసం కాదని తెలిపారు. ఈ 50వేల రూపాయల సహాయం కేవలం నామ మాత్రమే కానీ ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసేందుకే తనవంతుగా 50వేల రూపాయలు సహాయం చేయడం జరిగిందని జానీ మాస్టర్ చెప్పారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ బాయ్ తో పాటు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుదీర్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com