Logo
Date of Publish : 07 November 2023, 8:47 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులు ఏం మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారో చెప్పాలి

     చీపురుపల్లి, (జనస్వరం) : మెరక ముడిదాం మండల కేంద్రంగా నవంబర్ 9 వ తారీకున జరగబోయే వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను)చేస్తున్న గడప గడపకు ప్రోగ్రాము ను అడ్డుకుంటాం. zpc గా ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్న శ్రీను జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టారు. మెరక ముడిదామ్ మండలానికి గాని గ్రామానికి గాని ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలి. డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఉంది. త్రాగటానికి మంచినీళ్లు సరిగా రావడం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన వసతులు లేవు. అందుబాటులో డాక్టర్లు 24 గంటలు ఉండటం లేదు. ఎమర్జెన్సీ కేసులు గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటి? ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ బాలబాలికిలది రీ ఓపెన్ చేయాలి. మెరకముడిదాం గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారు వాటికి స్థలాన్ని కేటాయించాలి. బొత్స సత్యనారాయణ చిన్న శ్రీను మీరు ఏం ఉద్ధరించారని గడపగడప ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాల్లో మెరక ముడిదాం మండలం వెనుకబడి ఉంది. అన్ని రకాలుగా కడప గడప ప్రోగ్రాం చేయడానికి అర్హత లేదు. ఏం చేశారని ఇంటింటికి వైఎస్ఆర్ పార్టీ ప్రసారం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రేగిడి లక్ష్మణరావు, విజయనగరం జిల్లా నాయకులు, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com