Logo
Date of Publish : 03 February 2024, 7:56 pm
Editor : Sake Naresh

మీ ఓటుని ఉపయోగించి సరైన నాయకున్ని ఎంచుకునే బాధ్యత మీదే

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) :  తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో రెండోవ రోజు జనసేన పల్లెపోరు గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడునీ ఎంచుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఎన్నుకున్న వైసీపీ నాయకుడు మంత్రి పదవిలో ఉండి సొంత నియోజకవర్గానికి కనీస నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో రోడ్ల దుస్థితి చూస్తే మీకే అర్థమవుతుందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన టిడిపి పొత్తుల్లో ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అవినీతి పై సిబిఐ ఎంక్వైరీ చేస్తానని కడియద్ద గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండదండలు ఉంటాయని అన్నారు. గ్రామ అభివృద్ధికి తగిన సహాయం అందిస్తానాని, వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వన్ని గద్దె దించి జనసేన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అనంతరం ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో వేరువేరు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి బొలిశెట్టి శ్రీనివాస్ 10000 లు చొప్పున రెండు కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, మరియు కడియద్ద, తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com