అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గ కేంద్రంలో సోమవారము ఉద్యోగ, వివిధ గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా ( ఆదివాసి సేన సంఘం రాష్ట్ర నాయకులు ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతకాని ప్రభుత్వం రాజకీయ నాయకులు గిరిజన చట్టాలు హక్కులను కాపాడవలసిపోయి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ గిరిజనులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ గిరిజనుడు నిర్మించుకున్న లాడ్జిని కూల్చేయాలని ప్రభుత్వ సంబంధిత అధికారుల ద్వారా నోటీసు ఇప్పించడం ఇది ఎంతవరకు సబాబు అని ప్రభుత్వ రాజకీయ నాయకులు మీద ధ్వజమెత్తారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు పూర్తిగా అధికారం ఉంటుందని చట్టానికి వ్యతిరేకంగా షెడ్యూల్ ప్రాంతంలో మేడలు,మిద్దెలు, రిసార్ట్స్ లు మైదాన ప్రాంత వాసులు కడుతుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ, రాజకీయ సంబంధిత అధికారులు షెడ్యూల్ ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తులను కొమ్ము కాస్తున్నారే ఇది సమంజసం కాదని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలు శ్రేయస్ కోసమే పనిచేస్తామని చెప్పే నాయకులు అధికారం వచ్చాక గిరిజనులను మోసపూరితమైన రాజకీయం వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే లాడ్జిని కూల్చాలని జారీ చేసిన నోటీసును వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com