Logo
Date of Publish : 04 April 2023, 4:15 pm
Editor : Sake Naresh

వైసీపీ సర్పంచి పిలుస్తున్నాడు అని పిలిపించి మహిళను వివస్త్ర ను చేసి కొట్టడం దారుణం

       నెల్లూరు ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజక వర్గం పొదలకూరు మండలంలో మహిళపై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ ఆత్మహత్యా ప్రయత్నం చేసి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కోలుకుంటున్న బాధితురాలిని జనసేన జిల్లా ప్రధన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. మంత్రి గారి నియోజక వర్గం చాటగుట్ల లో వారి నాయకులు జరిపిన ఈ దాడి సభ్య సమాజం సిగ్గపడేలా వుందన్నారు. సర్పంచి తన వాడే అని అహంకారం తో వ్యవహరించిన పెంచలయ్య కు శిక్ష పడే వరకూ బాధితులకు జనసేన తరపున తోడుగా వుంటాం. పేదల పట్ల కనికరం లేకుండా దాడి చేయటం అమానవీయం, ఒంటరి మహిళల పై ఈ విధంగా దాడి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ₹10000 ల అప్పు తిరిగి ఇవ్వక పోతే ఇలా కొట్టమని చెప్పిందా మీ వై సీ పీ అధిష్టానం. అది కూడా అక్క బాకీ వుంటే చెల్లి పై దాడి చేశారు. ఏమి చేసినా చెల్లుతుందా మీ నాయకులకు అనాగరికంగా పేద మహిళల పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలి. అధికార మధం తో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు ఈ సారి సరైన బుధ్ధి చెప్పండి. అన్ని వర్గాల అభివృద్ధి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో కిషోర్ తో లక్ష్మన్, బలచంద్ర, రాజేష్, శ్రీను, ప్రతాప్,సాయి దీపక్,ప్రశాంత్ గౌడ్, మౌనేష్, వర, బన్నీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com