గుంటూరు ( జనస్వరం ) : ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో నూతనంగా దివి అలివేలమ్మ ను పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు 25 మంది మహిళలు నూతనంగా పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. గుంటూరు నగరంలో 33వ డివిజన్ వాస్తవ్యులు శ్రీమతి దివి అలివేలమ్మ ఆధ్వర్యంలో నూతనంగా 25 మంది మహిళలు మరియు 100 పైగా యువత పార్టీలోకి చేరటం చాలా సంతోషకరం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా పార్టీలో వీరమహిళలకు చాలా ప్రాధాన్యత కల్పించారు, వీరికి సముచిత గౌరవం కల్పించారు. అదే స్ఫూర్తితో మా జిల్లాలో కూడా ప్రతి ఒక్క మహిళకు ప్రాధాన్యతనిస్తూ వారికి సముచిత గౌరవం కల్పిస్తున్నాము. సుమారు 25 మంది గృహిణులు పొన్నగంటి ధనలక్ష్మి, ఇమ్మడి శకుంతలాదేవి, శివాలశెట్టి నాగలక్ష్మి, తన్నీరు సుజాత, కణతం ధనలక్ష్మి, పార్వతి, ప్రేరణ మల్లేశ్వరి, దొడ్డు మంగమ్మ, శేషాని వీరమ్మ, మలిశెట్టి కుమారి, ఇమ్మడి శైలుష, ఇమ్మడి కోటేశ్వరమ్మ, హారిక, ఉగ్గిరాల శారద, చందు భూలక్ష్మి, శారదా, తన్నీరు పద్మావతి, ఐలం సుభాషిని, పొన్నగంటి ఉషారాణి, కుంట విజయమ్మలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులను గమనించి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడవాలని వారు తలచి ఇలా జనసేన పార్టీలో చేరటం చాలా సంతోషకరమని తెలుపుతున్నాను. జనసేన పార్టీకి వెన్నుముకల నిలబడుతున్న మా వీర మహిళలు అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ భవిష్యత్తులో మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసేవరకు మనమంతా కష్టపడి పార్టీకి పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కడప మాణిక్యాలరావు నారదాసు రామచంద్ర ప్రసాద్, కార్పొరేటర్లు: దాసరి లక్ష్మి, యర్రంశెట్టి పద్మావతి, శిఖా బాలు, నాగం అంకమ్మరావు, చింతకాయల శివ, మదులాల్, ఇమ్మడి రామకృష్ణ, చిదంబరం, నెల్లూరు రాజేష్, తన్నీరు గంగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com