గుంతకల్ ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంతో బంద్ కు శాంతియుతంగా సంఘీభావం తెలుపుతున్న గుంతకల్ నియోజకవర్గం జనసేన నాయకులను అప్రజాస్వామ్యకంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని, ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తోంది, రాజకీయ ప్రత్యర్థుల రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యవస్థలను అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అవివేకం. రాజ్యాంగ విలువలకు ప్రజాస్వామిక స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిరంతృత్వ పాలనకి ప్రజలు చమర గీతం పాడే సమయం దగ్గర్లోనే ఉన్నదని, ప్రజాస్వామ్యాన్నిy బతికించుకోవడానికి, నియంతృత్వాన్ని ఓడించడానికి రాబోవు రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ శాంతియుత బంద్ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గుంతకల్ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురుబ పురుషోత్తం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్. కృష్ణ సీనియర్ నాయకులు బి.గోపి, పాండు కుమార్, కసాపురం నందా, ఆటో రామకృష్ణ, గంగాధర్ కాపు సంక్షేమ నాయకులు బుర్ర అఖిల్, కసాపురం వంశీ జనసైనికులు లారెన్స్, సూర్యనారాయణ, విజయ్ కుమార్, మారుతీ కుమార్ యాదవ్, రామకృష్ణ, ఆర్.సి సురేష్, అమర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.