నెల్లూరు ( జనస్వరం ) : వై యస్ ఆర్ సి పీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మదరసాలకు అవసరమైన నిర్వహణ ఖర్చు ఇవ్వడం లేదని విద్యాసంస్థల నిర్వాహకులు అందులో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారిని సంప్రదించారు. ఈ విషయమై మదరసాకి వెళ్లి తల్లిదండ్రులతో నిర్వాహకులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లింలు పవిత్రంగా భావించే మదరసా విద్యాసంస్థలను రెన్యువల్ చేయకపోవడం, వాటి నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుక పోవటం దారుణం. రెండు లక్షల రూపాయలతో సంవత్సరం అంతా నెట్టుకొస్తున్న ఈ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేయడం అమానుషం. నెల్లూరు లో దాదాపుగా 300 మంది పైగా విద్యను అభ్యసిస్తున్నారు. 2007లో గవర్నమెంట్ సర్వ శిక్ష అభియాన్ నుంచి సొసైటీ అనుమతులు పొంది నిర్వహిస్తున్న వీరికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంలో ఆ విద్యాసంస్థల్ని నిర్వహించడం చాలా కష్టంగా ఉంది . ఎవరి మతం వాళ్ళకి గొప్ప ఇస్లామిక్ ఖురాన్ చదువు వల్ల తమ బిడ్డలు సంస్కారవంతులవుతారుఅని నమ్మి చదివిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వం తరఫున ఎటువంటి నిధులు సమకూర్చకపోగా మామూలు విద్యాసంస్థల్లో చేర్చుకోమని అధికారులు సెలవిస్తున్నారు. డైకస్ రోడ్డు నందు రిహానా గారు మదరసా మదీనా మున్వార్ పేరిట దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఆమె సొంత ఖర్చుతోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు భవితను ఆలోచించి ఉన్నవారిని చదివు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది. ఆలోచన లేని ఈ వైసిపీ ప్రభుత్వం చర్యల వలన మదరసా విద్యాసంస్థల్లో చదువుతున్న బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. డైస్ కోడ్ ఇచ్చి స్కూల్ పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వానికి వారి విద్యను పూర్తి చేయవలసిన బాధ్యత కూడా ఉంది. భారత దేశం లో ఐఐటీ లను మొదటగా ప్రారంభించి IIT పితామహుడుగా మనం కీర్తిస్తున్న అప్పటి విద్యా మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా మదరసా విధ్యార్ది. ఆయన చేతుల మీద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కూడా ప్రారంభించిన సంగతి విధితమే. భారతదేశంలో పురాతనంగా కొనసాగుతున్న ఈ విద్యా సమస్యలను యధావిధిగా కొనసాగించేందుకు అధికారులతో మాట్లాడి విద్యార్థులు తల్లిదండ్రులకు,నిర్వహకులకు జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతాం. వారికి రావాల్సిన నిధులు సమకూర్చే విధంగా లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్ చూపే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వీరికి న్యాయం జరిగేటట్టు చూస్తాం.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చెప్పినట్లు బడ్జెట్లో ₹16కోట్ల47 లక్షల కేటాయిస్తే వాటిలో ఏడు శాతం మాత్రమే అంటే కోటి 20 లక్షలు మాత్రమే ముస్లిం లకి ఖర్చు పెట్టాడు జగన్. ముస్లింలకు న్యాయం చేయగలిగే నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షాదీ తోఫా అందకుండా చేశాడు,ముస్లిం సోదరుల రాయతీలు కాని వాళ్ళ బిడ్డలకు ఇస్తున్న స్కాలర్షిప్లు గాని అందని ద్రాక్షనే చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు అన్ని మతాలు, అన్ని కులాలు,అన్ని వర్గాల అభివృద్ధి చెందే విధంగా పరిపాలన సాగాలంటే ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే. ఈ సారి మా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాల్సిందిగా కోరారు.. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు మదరసా విద్యాసంస్థల నిర్వాహకులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.