బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన నాయకులతో కలిసి బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ని సందర్శించిన బాబు పాలూరు. కాంప్లెక్స్ యొక్క ఇంచార్జి తో మాట్లాడి బొబ్బిలిలో నిత్యం 5 వేల పైచిలుకు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. పేదవాడి విమానం ఈ RTC బస్సు కదా, అటువంటిది కనీస మౌలిక వసతులు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అలాగే ప్రయాణికులు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని, అస్సలు ఆర్టీసీ కాంప్లెక్స్ లో కరెంటు లేకపోవడం ఏంటని కనీసం సోలార్ పెట్టి ఒక రెండు, మూడు లైట్స్ అయినా రాత్రి పూట వెలిగించి ప్రయాణికులకు వెలుగును ప్రసాదించండని, కూర్చోవడానికి విరిగెపోయిన కుర్చీలు, కాంప్లెక్స్ మొత్తానికి కేవలం 4 ఫ్యాన్స్ ఏంటని, త్రాగు నీరు సదుపాయం లేకపోవడమేంటని, టాయిలెట్స్ లేక మహిళలు నానా అవస్థలు పడుతున్నారని, ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ని మూసేసి ప్రయివేట్ టాయిలెట్స్ ఉపయోగించమని చెప్తున్నారని, అవి కూడా కనీసం పరిశుభ్రతగా ఉండాలి కదా అని దుమ్మెత్తారు, కాంప్లెక్స్ ఆవరణం మొత్తం అపరిశుభ్రతగా ఉందని ఇలా అయితే ప్రయాణికులు ఎదో ఒక రోగం బారిన పడకుండా ఎలా ఉంటారని అన్నారు. విజయనగరం జిల్లాలో 2వ అతిపెద్ద నగరమైన బొబ్బిలిలో RTC కాంప్లెక్స్ దుస్థితి ఏంటని నిలదీశారు. కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న మొత్తం 38 షాప్స్ ఉన్నాయి వాటి నుండి నెలకి 5లక్షలు పైనే ఆదాయం వస్తుంది. మరి ఇదంతా ఎక్కడికి పోతుందని, ఆ డబ్బులతో ఆర్టీసీ కాంప్లెక్స్ ని పరిశుభ్రంగా మరియు ప్రయాణికులకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించొచ్చు అని తెలియజేసి దీనిపై ఒక వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ సంచాన, జనసేనపార్టీ వీర మహిళలు బంటుపల్లి దివ్య గారు, రమ్య గారు, నాయకులు పల్లెం రాజా, బెవర గణేష్, మహంతి ధనంజయ్, సత్యనారాయణ,చీమల సతీష్, వెంకటరమణ , గేదెల శివ, చందక రామకృష్ణ, పోతల శివశంకర్, శంకర్, కిరణ్, తీగల నరేష్, సంతోష్, రాజు, మోహన్, అలాగే రాంభద్రపురం, తెర్లాం, కోమటిపల్లి, అలజంగి, అప్పయ్యపేట, గ్రామాల జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com