Search
Close this search box.
Search
Close this search box.

దున్నపోతు మీద వాన పడినా .. దోపిడీ గురించి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకి చెప్పినా ఒకటే

    నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దిపూడి సుదీర్ ఆధ్వర్యంలో మినగల్లు పాల తిప్ప లోని ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాల పై నిరసన చేపట్టారు. కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, మినగల్లు గ్రామం. అక్కడి నుంచే ఎమ్మార్వో గారికి ఫోన్ చేసి వివరాలు అడగ్గా ఎమ్మార్వో ని అడిగితే సెబి అధికారులు అడగమంటారు. సెబీ అధికారులను అడిగితే నాకు ఇసుక మాత్రమే తెలుసు… మిగిలినది తెలియదు అంటాన్నారు. ఎవరు జవాబు దారితనం లేకుండా సమాదానం ఇచ్చారు. వారి వారి ఏరియాలో వారికి అనుమతి లేకుండా ఈ అక్రమ తవ్వకాలు దాదాపుగా 10 ఎకరాలు పైబడి పది పదిహేను అడుగులు లోతుకి తవ్వి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మినగల్లు సహజంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను అడ్డగోలుగా తవ్వి అక్రమ సంపాదన చేసుకుంటున్నారు. నియోజకవర్గ మొత్తం మీద అక్రమ తవ్వకాలు భారీగానే ఉన్నాయి సహజ వనరులను ఇష్టం వచ్చినట్లు తవ్వి ఇసుక గ్రావెల్ మట్టి కాదేది అనర్హం అన్నట్లుగా దేన్నైనా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే దౌర్జన్యం దాడికి పాల్పడడం ఆనవాయితీగా మారింది.. తిరుమలలోని చిరుతల సంచారం కూడా సహజ వనరుల దోపిడీలో ఒక భాగమే అనిపిస్తుంది. అడవుల్లో ఎర్రచందనం భారీగా తరలించడం వల్ల జంతువులు భయపడి జనావాసంలోకి వస్తున్నాయని ఒక నివేదిక కూడా తెలిపింది. ప్రకృతి విలయాలకు కారణమవుతున్న వైసీపీ నాయకులు అయినా కూడా బుద్ధి లేదు. అధికారం రాంగానే అక్రమార్జన కు లైసెన్స్ ఇచ్చినట్టు ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇక మా కోవూరు పరిస్థితి అయితే దున్నపోతు మీద వాన పడినా దోపిడి గురించి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారి చెప్పిన ఒకటే పరిస్థితి ఇద్దరు వైఖరిలో చింతే కనపడదు. చిన్నారి లక్షిత మరణ వార్త విని విచారిస్తానన్న ఎమ్మెల్యే గారు పాపను బలిగొన్న చిరుత దొరికిందంట…మీరు విచారిస్తానంటే దాని బోన్ లోకి మిమ్మల్ని పంపుతాం లేదంటే ఆ పులిని మీ ఇంటికి పంపుతాం…. విచక్షణ వివరం లేని మీ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. అదనంగా తిరుమల నడక యాత్రకు ఇస్తానన్న ఊత కర్రలను కూడా తోడు తీసుకెళ్లండి. జగనన్న స్టికర్ వేసున్న కర్రతో కొడితే పులి వెళ్లి పులివెందులలో పడాలి. పులుల సంచారం పెరిగితే కర్రలు కాదు కంచె వేస్తే సరిపోతుందని జ్ఞానం లేకుండా పోయింది. జింకలను కాపాడేందుకు వేసిన ఫెన్సింగ్ మనుషుల్ని కాపాడేందుకు వేయలేకపోతున్నారా..? స్త్రీలు వారి గౌరవం గురించి మాట్లాడడానికి మీకు అంతకు తగిన ప్రవర్తన లేదు. లేస్తే మా పెళ్లిళ్లు గురించి మాట్లాడుతారు మీ వారు ఎవరైనా ఆశపడి ఉంటే వారికి చెప్పండి ఆయన దగా పడిన ప్రజలను వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజాక్షేత్రంలో శ్రమిస్తున్నారు.. బుచ్చి ఎమ్మార్వో గారికి అయితే ఈ తవ్వకాల గురించి ఎన్ని సార్లు చెప్పినా ఇంచి ప్రయోజనం కూడా ఉండదు. ఎంత త్వరగా ఇంటికి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే సహజ వనరులను అంత కాపాడుకోవచ్చు.  అక్రమంగా వీరు తవ్వి తరలించటం వల్ల ప్రజలకు ఒక ట్రాక్టర్ మట్టి కావాలన్నా ఇసుక కావాలన్నా ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి. ఎమ్మార్వో గారు వారం రోజుల లోపల దీని కట్టడికి నిర్ణయం ప్రకటించకపోతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీటి పరిష్కారం జరిగే వరకు కూడా జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సాయి,షారు,కాసిఫ్, షాజహాన్, ఖలీల్, మౌనిష్, కేశవ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way