రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ప్రజా ప్రభుత్వమే

        సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామం నందు ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ  ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన జీవితాలలో వెలుగులు నింపుకోవడం కోసమే భారత రాజ్యాంగం ఓటు అనే ఆయుధాన్ని మనకు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.  ఆ ఓటు అనే ఆయుధాన్ని నీతి, నిజాయితీ గల నాయకుల్ని ఎన్నుకోవడానికి వినియోగించడం మన బాధ్యత. రాక్షస పరిపాలన చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లయింది.  రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది.  నమోదైన దొంగ ఓట్లను గుర్తించి తొలగించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైనే ఉందన్నారు.  యువతి, యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నెలకొల్పి ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఐటీ వింగ్ ఇంచార్జ్ పసుపులేటి ప్రసాద్, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు పిన్నిశెట్టి మల్లికార్జున్, షేక్ రహీం, చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా, వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి, సీనియర్ నాయకులు దయాకర్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way