Logo
Date of Publish : 25 October 2023, 9:29 pm
Editor : Sake Naresh

నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన భాధ్యత ఎమ్మెల్యేదే : పాఠంశెట్టి సూర్యచంద్ర

  జగ్గంపేట ( జనస్వరం ) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 685వ రోజు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ నేపథ్యంలో నరేంద్రపట్నం గ్రామంలోని రైతులంతా కలిసి సూర్యచంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కర ఆయకట్టులో ఉన్న రైతులంతా పుష్కర నీరు వస్తుందనే నమ్మకంతో ఏకరాకు సుమారు 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టీ పంటలు వేశారని అన్నారు. కానీ ఇవ్వాల్సిన సమయానికి నీరు అందివ్వక వేసిన పంటలు అన్ని ఎండిపోయాయని, కనీసం రైతులు పంటలు వేసే ముందే ప్రభుత్వం మరియు అధికారులు కలిసి పుష్కర ఆయకట్టులో ఉన్న రైతులకు ఈ సంవత్సరానికి సాగునీరు అందించడం కుదరదు అని ముందే ప్రకటించి ఉంటే రైతులు పంటలకు పెట్టుబడి పెట్టి అనవసరంగా నష్టపోయి ఉండేవారు కాదని చెప్పారు. ఈ విధమైన పంట నష్టానికి ప్రభుత్వమే కారణం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు భాధ్యత వహిస్తూ ప్రభుత్వం నుండి నష్ట పోయిన రైతులందరికి ఎకరానికి 50 వేలు రూపాయలు నష్ట పరిహారం వచ్చేలా కృషి చేసి పుష్కర ఆయకట్టులో ఉన్న రైతులందరిని ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com