Logo
Date of Publish : 07 December 2021, 1:25 pm
Editor : Sake Naresh

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించడం బాధాకరం : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

     విజయవాడ, (జనస్వరం) : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీ, సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని, ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటు పడాలని కోరారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని ఆ దిశగా తాము ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సోమనాథం, టీ మైనర్ బాబు, గన్ని రాము, దోమకొండ. మేరీ, నారాయణ ప్రదీప్ రాజ్,సోము. గోవిందు, ఆకారపు.విజయ కుమారి, ధార. రాము రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి.వాసు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనిత, చేనేత విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్.సంజీవరావు, అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు, జనసేన ముఖ్య నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com