సర్వేపల్లి ( జనస్వరం ) : మనుబోలు మండలంలోని కాగితాలపూరు హైవే సెంటర్ నందు హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ షాక్ కు గురై రాజేశ్వరమ్మ అనే మహిళ చనిపోయిందని తెలిసి ఆ ప్రాంతానికి వెళ్లి రామకృష్ణారెడ్డి గారితో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రాజేశ్వరమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. గత మూడు నెలల నుంచి ఆ ప్రాంతంలో ఉన్న దుకాణదారులందరూ కూడా హై వోల్టేజ్ వస్తుందని అనేకమార్లు విద్యుత్ అధికారులకు తెలిపిన వారు స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏడాదికి రెండు, మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ వెళ్తుంది. వినియోగదారులకు మాత్రం నాణ్యమైన విద్యుత్ అందించడంలో వైసీపీ ప్రభుత్వం విప్లవమైంది. కాగితాలపూరు హైవే సెంటర్ నందు ఉన్న ఈ ప్రాంతంలో హై వోల్టేజ్ విద్యుత్ సమస్య ఉందని విద్యుత్ అధికారులకు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం. విద్యుత్ అధికారులు స్పందించి ఉంటే రాజేశ్వరమ్మ చనిపోయి ఉండేది కాదు. ఆ కుటుంబానికి రాజేశ్వరామ్మే జీవన ఆధారం అటువంటిది ఆమె చనిపోవడం బాధాకరం. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఆ ప్రాంతంలో నెలకొన్న హై వోల్టేజ్ సమస్యను వెంటనే విద్యుత్ శాఖ అధికారులు పరిష్కరించాలని జనసేన తరుపున డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు, సమస్య పరిష్కారానికై టీడీపీతో కలిసి జనసేన ఆందోళన చేయడానికైనా సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కంటే సుధాకర్, జనసేన మండల కార్యదర్శి జాకీర్, కోటిరెడ్డి, చిరంజీవి యువత అధ్యక్షులు ఖాజా, వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.