పుట్టపర్తి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పును 8 లక్షల కోట్లు చేసిన మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. ఈ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వృద్ధాప్య పెన్షన్లు కూడా వారం, 10 రోజుల తర్వాతనే అందుతున్నాయి. పారిశుద్ధ కార్మికులకు నెలలకొద్దీ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు తద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్ టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరు కూడా సుముకత చూపించడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసి కనీసం వడ్డీ కట్టలేని స్థితికి తీసుకెళ్లారు. త్వరలో ఎలక్షన్లో వస్తాయని ఇప్పుడు ప్రజలను మీ మాటలతో మభ్య పెట్టడం సమంజసం కాదు. ప్రతి సామాన్యుడు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి బుద్ధి చెబుతారని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము అని తెలియపరిచారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com