సూళ్ళూరుపేట ( జనస్వరం ) : ఒక రోడ్డు సరిగా వేయలేని వైసిపి మూడు రాజధానులు, అభివృద్ధి గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం అని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో సమాధానం చెప్పగలరా అని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్యను సూటిగా ప్రశ్నించారు. పైగా ర్యాలీలకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మరియు వైసీపీ నాయకులు చదువుకునే పిల్లల్ని వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని వైసిపి అసమర్థ పాలనపై ధ్వజమెత్తారు. జనసేన మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు సుదీర్ఘ పోరాటాల తర్వాత వచ్చిన రోడ్డు మన్నారుపోలూరు రోడ్డు, మరి అలాంటి సూళ్లూరుపేట నుంచి మన్నారుపోలూరు మీదుగా శ్రీకాళహస్తి వెళ్లే రోడ్డు విషయంలో ఎంత నాణ్యత ప్రమాణాలు పాటించారో ఈ వైసీపీ ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా మీడియా వారు కూడా దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రోడ్డు వేసిన నెల రోజులకే గుంతలు పడ్డాయి అంటే మరో సంవత్సరంలో ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి! ఏ అవినీతికి పాల్పడకుండా ఈ వైసీపీ ఇలాంటి నాణ్యత లేని రోడ్డు వేసుంటదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది అని జనసేన పార్టీ తరఫున తెలియజేసారు. అలాగే సోమశేఖర్ మాట్లాడుతూ రాబోయే 2024ఎన్నికల్లో ఈ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు జనసేన ను గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com