Search
Close this search box.
Search
Close this search box.

నీతి నియమాలు లేని వ్యక్తి జగన్ సీఎం కావడం మన దౌర్భాగ్యం

జగన్

     కడప ( జనస్వరం ) : సామర్లకోట సభలో సీఎం జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కడప జనసేన పార్టీ కార్యాలయంలో సుంకర శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సంధర్భంగా ఆయన మట్లాడూతూ దోచుకునేవాడు దాచుకునేవాడు సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఎపీని చూస్తే అర్థమవుతుందని అన్నారు. పదేళ్ళుగా బెయిల్ పై ఉన్న జగన్ రెడ్డి రాజ్యాగాన్ని సైతం అపహాస్యం పాలు చేశారు. లక్ష ఇళ్లైనా ప్రజలకు ఇచ్చారా జగన్ చెప్పే ప్రతి మాట డోల్లతనమే అధికారులను భయపెట్టి పాలన సాగిస్తున్నారు. విధాన పరంగా మాట్లాడాల్సిన బటన్ రెడ్డి మా నాయకుడిపై వ్యక్తిగతంగా విమర్శిచడం తగదు. జనసేనాని సంధిస్తున్న ప్రశ్నలు సమాధానం చెప్పలేక మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడానికి సిగ్గు లేదా గౌరవం ఇచ్చి పుచ్చుకోకపోతే మా జనసైనికులు తగిన బుద్ధి చెబుతారు. ఒళ్లంతా మచ్చలు ఉన్న బటన్ రెడ్డి నోరు పారేసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎంతోమంది ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్వంత చెల్లి, తల్లికే న్యాయం చేయలేని జగన్ మరోకరిపై వ్యక్తిగత వాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రజల దృష్టి మరల్చేందుకు ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలసి మిమ్మల్ని సాగనంపే రోజులు అతి దగ్గరలో ఉన్నాయన్న అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపై పవన్ కళ్యాణ్ పై ఇలానే అవాకులు చవాకులు పేల్చిన వ్యక్తిగత విమర్శలు చేసిన ఖబర్దార్ జగన్ రెడ్డి మీకు మీ వైసీపీ నాయకులకు కడప జనసేన పార్టీ కార్యాలయం నుంచి హెచ్చరిస్తున్నామని అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. మీ మాటలను వెనక్కి తీసుకోవాలి లేదా ప్రజలతో కలసి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సురేష్ బాబు, మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్, పత్తి విస్సు బోరెడ్డి నాగేంద్ర, స్వరూప్, గజ్జల సాయి, శేషు రాయల్, వినయ్, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, చార్లెస్, లోకేష్, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way