విజయనగరం ( జనస్వరం ) : గంట్యాడ మండలంలో వెలగాడ గ్రామం, తమరపళ్లి గ్రామం లో రైతులను సన్మానించడం జరిగింది. జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు,అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు.ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వల్లే. అలాంటి రైతుకి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకొంటారు. చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5వ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందరీ చట్టం రద్దు అయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశ పెట్టడం జరిగింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్‌సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ప్రసాద్, చేనేత విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ ప్రియాంక మండల నాయకులు పిట్ట బాలు, చౌడువాడ రాంబాబు, చిన్ని కృష్ణ, సుంకరి కోటి, పొట్నూరు చంటి, పండు, శ్రీను, హరీష్ నాని, గుద్దుల ఈశ్వరరావు, జానీ, శ్రీను, కోరాడ గణేష్,కే దాసు, పడాల శివకుమార్, పైడ్రాజు, అప్పన్న దొర, నాగిరెడ్డి కాళీ,సత్తిబాబు రుద్ర, పసుమర్తి సాయి, నాగు బిల్లి శంకర్రావు, దాట్ల గంగరాజు, గారి గౌర్నాయుడు, పిట్ట రఘు, వారబోయిన గంగరాజు జన సైనికులు పాల్గొన్నారు.