Logo
Date of Publish : 13 January 2024, 9:49 pm
Editor : Sake Naresh

అంగన్వాడీల జీవితాలతో చెలగాటమాడటం జగన్ రెడ్డికి తగదు

   గుంటూరు ( జనస్వరం ) :  తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ముప్పై మూడు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు, బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. గుంటూరు కలక్టరేట్ ఎదుట జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా జనసేన శ్రేణులు శనివారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ పేద, దిగువ మధ్య తరగతి ప్రజాలేనన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో అంగన్వాడీల జీవితాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ల సమస్యలను పెద్ద మనసుతో అర్ధం చేసుకొని జగన్ రెడ్డి పరిష్కరించాలన్నారు. పంతాలకు, పట్టింపులకు పోయి వారి జీవితాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ సమ్మె వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయనటం సజ్జల రామకృష్ణ రెడ్డికి తగదన్నారు. సమ్మె వెనుక అంగన్వాడీల వేదన, జీవన పోరాటం ఉందన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగటం సజ్జల దృష్టిలో పెద్ద తప్పుగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం లోని అన్నివర్గాల ప్రజలు జగన్ రెడ్డి అసమర్ధ, అవినీతి, దుర్మార్గపాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. గద్దెని ఎక్కించిన వారికి ఆ గద్దెని దించటం కూడా బాగా తెలుసున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయసమ్మతమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పండగ అనంతరం ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపడతామని ఆళ్ళ హరి హెచ్చరించారు. కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, జనసేన నాయకులు గడ్డం రోశయ్య, గుర్రాల ఉమ, రాజేష్, వెంకట్, సీ ఐ టీ యు నాయకులు కే వెంకటేశ్వర్లు, ముత్యాలరావు, ఉద్యమ నాయకుర్రాళ్ళు రాధా, వెంకాయమ్మ , జెర్సీ, దీప్తి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com