Search
Close this search box.
Search
Close this search box.

ఏలూరులో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యం

ఏలూరు

     ఏలూరు ( జనస్వరం ) : ఈనెల 19 తేదీన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానాలు చెల్లవని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో శనివారం రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ లోకల్ బాడీ యాక్ట్ గురించి మేయర్ కు, పాలకవర్గానికి, ఎమ్మెల్యేకు తెలుసా అని ప్రశ్నించారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆరు నెలల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆరు నెలలు దాటిన తర్వాత కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. 29 మార్చి 2023న కౌన్సిల్ సమావేశం జరిగిందని, తిరిగి 19 అక్టోబర్ 2023వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించారన్నారు. గడువు తీరిన తర్వాత కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో చేసిన తీర్మానాలుతో పాటు కౌన్సిల్ కూడా రద్దు అవుతుందని తెలిపారు. రెండోసారి బాధ్యతలు నిర్వహిస్తున్న మేయర్, ఎమ్మెల్యేలు చట్టాలను గౌరవించడం లేదన్నారు. చట్టానికి విరుద్ధంగా కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేస్తే అవి చెల్లవని స్పష్టం చేశారు. అక్రమంగా కౌన్సిల్ సమావేశం, తీర్మానాలపై మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌన్సిల్ సమావేశం ఎన్ని రోజులకు ఏర్పాటు చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆళ్ల నాని ఎమ్మెల్యే పదవికి అనర్హుడని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.

                ప్రజా సమస్యలపై చర్చించకుండా బ్యాండ్ బ్యాచ్ లాగా ఎమ్మెల్యే వెంట తిరగడం మానుకోవాలని, ఏలూరు నగరావృద్దిపై దృష్టి కేంద్రీకరించాలని మేయర్ కు సూచించారు. కార్పొరేషన్ లో అవినీతి రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. ప్రమోషన్ ఇప్పిస్తానని 8 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దర్యాప్తు చేసిన ఐఏఎస్ అధికారి ఏసీబీకి రిపోర్ట్ చేసినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదని, అంతేకాకుండా అవినీతికి పాల్పడిన వ్యక్తిని మళ్లీ అదే స్థానంలో వేయడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తుందన్నారు. హిందూ స్మశాన వాటికకు 97 లక్షల 50 వేల రూపాయలు కేటాయిస్తున్నట్లు కౌన్సిల్లో పెట్టారని, ఎలా ఖర్చు చేస్తారో వివరాలు పెట్టలేదన్నారు. చెత్త పన్ను విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని, జమా ఖర్చుల వివరాలు చెప్పడం లేదని, ఎవరికి వారే దోచుకు తింటున్నారని ఆరోపించారు. సచివాలయం నిర్మాణానికి కోటి 24 లక్ష రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి ఇచ్చేందుకు కౌన్సిల్ తీర్మానం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజల డబ్బును పాలకపక్షం దుర్వినియోగం చేస్తుందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తే గొంతుక నొక్కుతూ దౌర్జన్యం చేసి, అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నేడుతున్నారన్నారు. కృష్ణ వారధిపై రిటర్నింగ్ వాళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట తప్పడంతో జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించి నిరసన కార్యక్రమం చేపడితే ఎమ్మెల్యే తన అనుచరులతో దౌర్జన్యం చేయించి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. మరో నాలుగు నెలలు మాత్రమే అధికార పార్టీ నాయకులకు అవకాశం ఉందని, తర్వాత ప్రజలే తరిమి కొడతారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, గంజాయి హెరాయిన్, లిక్కరు, శాండ్, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోతున్నాయన్నారు. యువత నిర్వీర్యం అవుతుందని, కొంతమంది మంత్రులే క్రికెట్ బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. అరాచక, దోపిడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way