Logo
Date of Publish : 13 May 2023, 7:25 pm
Editor : Sake Naresh

ఏపీ హైకోర్టు జీవో నెం.1ని కొట్టివేయడం అభినందకరమైన విషయం

     పార్వతీపురం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపక్షాల పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ ఒకటిని ఏపీ హైకోర్టు రద్దు చేయడం చాలా అభినందకరమైన విషయమనికోరుతూ ఈ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం వీరఘట్టం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి *జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స.పుండరీకం బి.పి. నాయుడు, జనసేన జాని లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మునుపేన్నడు లేని విధంగా ఈరోజు జీవో నెంబర్ ఒకటి తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా కక్ష సాధింపు చర్యలు పూనుకోవడం అన్యాయమని అలాగే ఇలాంటి సందర్భంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా జీవో నెంబర్ తేవడం చాలా అన్యాయమని ఇలాంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను తీసుకు రావడం చాలా అన్యాయమన ఈ దీనిపైన జనసేన పార్టీ తో పాటు, వివిధ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద పోరాటాలు జరిగిన నేపథ్యంలో ఈరోజు జీవో నెంబర్ ఒకటిని రద్దు చేసే విధంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా శుభపరిణామని అన్నారు. కావున ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతుల సమస్యలు పరిష్కరించాలి తప్ప ఇలా జీవోలు మీద జీవోలు తెచ్చి వివిధ వర్గాల ప్రజల పైన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి, పవన్, ప్రణీత లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com