
కాకినాడ ( జనస్వరం ) : కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం లో పంచాయతీ ఉప ఎన్నికలకు గొడ్డటిపాలెం 6వ వార్డు నుండి చోడబత్తుల మణికంఠ , నడకుదురు గ్రామం నుండి 7వ వార్డులో గుల్లిపల్లి మాధవ శ్రీను గారు జనసేన పార్టీ నుండి ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం జరిగింది. దీనిని బట్టి కాకినాడ రూరల్ లో శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయపథంలో దూసుకుపోతుంది. జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ గారు ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వంలో పంచాయతీలో నిధులు లేకపోయినా కానీ ప్రజలు జనసేన పార్టీ పై నమ్మకంతోవీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పంతం నానాజీ గారు తెలిపారు.