Logo
Date of Publish : 25 January 2024, 7:19 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం

          అవనిగడ్డ ( జనస్వరం ) : కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించటం చాలా సంతోషకరమైన విషయం. 2019లో ఇదే గాజు గ్లాస్ గుర్తుపై ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. మరల 2024 లో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించినందుకు కేంద్ర, రాష్ట్ర, ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈరోజు అవినిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచి, జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, జనసేన పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మత్తి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేసినారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com