తిరుపతి ( జనస్వరం ) : అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్టతో ఎన్నో ఏళ్లనాటి హిందువుల స్వప్నం సాకారమైందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. సోమవారం జనసేన ఆధ్వర్యంలో శ్రీరామనామ శోభాయాత్రను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టతో యావత్ దేశం పులకించిపోయిందన్నారు. ఆ అమృత ఘడియల్లో దేశం మొత్తం భక్తిప్రపత్తులను చాటుకుందన్నారు. రామాలయం లేని ఉరు లేదని, అలాంటిది అయోధ్యలో ఇన్నాళ్ల తరువాత స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరగడం చాలా సంతోషమన్నారు. తండ్రి మాటను జవదాటని కొడుకుగా రాముడు, భర్తను అనుసరించిన మహా సాత్విగా సీతాదేవి, అన్న కోసం పరితపించే లక్ష్మణుడు ఇలా కుటుంబ విలువలను చాటి చెప్పిన మాహా కావ్యమే రామాయణం అన్నారు. దశావతారాల్లో ఒక అవతారమైన శ్రీరామ అవతారం సనాతన ధర్మానికి ప్రతీక అని తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. అయోధ్య రామ మందిర నిర్మణానికి భూరి విరాళాన్ని ఇచ్చారన్నారు. సోమవారం ఆయన అయోధ్యలో మీడియాతో మాట్లాడుతూ భాచోద్వేగానికి లోనయ్యారని, ఇంకా చాలా చేయాలని ఉందని చెప్పడం ఆయన భక్తిల్రపత్తులకు నిదర్శనమన్నారు. అంతకు ముందు ఆయన జనసేన శ్రేణులతో కలిసి పంచముఖ అంజనేయస్వామి ఆలయం నుంచి రాములవారి ఆలయం వరకు రామనామ సంకీర్తన చేసుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు హేమకుమార్, ఆనంద్, బాటసారి, రాయలసీమ కార్యనిర్వాహన కమిటీ సభ్యులు కొండా రాజమోహన్, నగర కమిటీ నాయకులు లక్ష్మి, రుద్రాకిషోర్, కిరణ్ కుమార్, హేమంత్, పురుషోత్తం, సాయి దేవుడు యాదవ్, సాయి కుమార్, మనోజ్ కుమార్,అర్బన్ అధ్యక్షుడు జనసేన సాయి, జనసైనికులు మోహిత్, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.