Logo
Date of Publish : 20 December 2022, 4:37 pm
Editor : Sake Naresh

ఇంగిత జ్ఞానం లేకుండా నిస్సిగ్గుగా మీడియా ముందుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం హేయమైన చర్య

         అనంతపురం ( జనస్వరం ) : సజ్జల రామకృష్ణారెడ్డి గారు... మీరు కేవలం ప్రభుత్వ సలహాదారులు మాత్రమే, మీరు మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు చేయకూడదు? ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించకూడదు? ఎందుకంటే మీరు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బుల్ని జీతముగా తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో దేవర దున్నపోతులు ఉంటాయి ఆ దున్నపోతులు అన్ని ఇండ్ల కాడ బలవంతంగా మేసి, బలిసి ఆ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటాయి అలాగా ఉంది మీ ప్రవర్తన తీరు!! ఎందుకంటే ప్రజల సొమ్మును జీతాలుగా మీరు తీసుకొని ఆ ప్రజలకు ప్రతినిధులైన వారిని రాజకీయ విమర్శలు చేయడం. కనీసం ఈ ఇంగిత జ్ఞానం లేకుండా నిస్సిగ్గుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం దారుణం, నీచమైన, హేయమైన చర్యగా మేము భావిస్తున్నామని అన్నారు. నిన్నటి రోజున మీరు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి... ఎవరో స్క్రిప్ట్ ప్రకారం జనసేనని నటిస్తారు అని చిలక పలుకులు పలకడం దుర్మార్గమైన చర్య. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని వ్యవస్థలపైన.. అంశాల పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవాల్సిన స్థితిలో లేరు, గత ఏడేళ్లుగా ఇదే విషయాలు చెబుతూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు. మీ దొంగల ముఠా నాయకుడు లాగా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే వేదిక పైన చదవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నామన్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు... దూరేది గుడిసెల్లేకి ఉన్నట్టుగా మీ ప్రవర్తన తీరు ఉంది. ఇప్పటికైనా మీరు బాధ్యత గుర్తిరిగి ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వానికి మాత్రమే సలహాలు ఇవ్వండి, మీరు రాజకీయ విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com