రాజంపేట ( జనస్వరం ) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నమయ్య విపత్తు జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో మరొక మారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరిని ఎండగట్టుతూ ఈ పర్యటన సాగింది. సర్వస్వం కోల్పోయిన బాధితులకు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం చేయలేని పరిస్థితి తు తూ మంత్రంగా సాయం చేస్తే సరిపోదు. నిరాశ్రాయులకు ఆశ్రయాలు కల్పించడంలో ఈ విధమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు చాలా దారుణంగా ఉన్నాయి కొండలకు గుట్టలకు పరిమితం చేశారు మనుషులను మనుషులు సంసారాలు చేసే చోట ఇల్లు ఉంటే బాగుండు గుట్టల మీద ఇండ్లు కట్టుకొని. బాగుపడిన సందర్భాలు లేవు ఈ విషయమై ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ఉమ్మడి ప్రభుత్వం వస్తే ముందస్తుగా అన్నమయ్య డ్యాం బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ వారికి మేము అండగా ఉంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. గ్రామస్తులతోపాటు ఎన్ఆర్ఐ జనసైనికులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామయ్య, జగపతిబాబు, శివరామ్, నరసయ్య, స్థానిక గ్రామస్థులు, మహిళలు, జనసైనికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముకరం చాన్, జనసేనపార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, జనసేనపార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామ శ్రీనివాస్, రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికార దినేష్, యువ నాయకుడు గురివిగారి వాసుదేవ, కొట్టే శ్రీహరి, నాగార్జున, హేమంత్, మస్తాన్ కడప జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గురివిగారి వాసుదేవ, నరేంద్ర, పత్తి విస్సు,యువ నాయకులు గోపాల్ రాజంపేట నాయకులు పొలిశెట్టి శ్రీనివాసులు, పలుకూరు శంకర్ మైనార్టీ నాయకులు లతీఫ్, మహబూబ్ భాష, బీసీ నాయకులు చౌడయ్య.యువ నాయకులు జెట్టి మస్తాన్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com