నెల్లూరు ( జనస్వరం ) : గుంతలమయం అయిన రోడ్లను పూడ్చాలని, గ్రామాల కనెక్టివిటీ రోడ్లను మెరుగు పరచండని అంటూ జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అసని తుఫాను కారణంగా పడిన ఓ మోస్తరు వానలకే తూ మంత్రగా వేసిన రోడ్లన్నీ చిధ్రం అయ్యాయి. తాత్కాలికంగా వేసిన రోడ్లన్నీ మళ్ళీ గుంతల మయం అయ్యాయి. గతంలో ఇదే మాదిరిగా రోడ్లు అధ్వానం రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అని నిరసన చేపట్టిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం తప్పితే ఉద్దరించిది ఏమిలేదుని నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ నామమాత్రంగా వేసిన రోడ్లు కొట్టుకుపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన మూడు సంవత్సరాలలో తాత్కాలికంగా గుంటలు పూడ్చటమే కానీ, శాశ్వత రోడ్ల ఏర్పాటు చేయటంలో విఫలమైంది. గ్రామాల కనెక్టివిటీ రోడ్లు అయితే మరింత అధ్వానంగా మారి రాకపోకలకు అంతరాయం గా ఉన్నవి. నెల్లూరు రూరల్ కార్పొరేషన్ పరిది స్థానిక హరనాధపురంలో అయితే రోడ్లపై గుంటలు లోయల్ని తలపిస్తున్నాయని అన్నారు. స్థానికులు తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో గుంతలకి అడ్డంగా పూలకుండీలు పెట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఇటీవల కాలంలో గ్రామాల కనెక్టివిటీ రోడ్లు నిర్మాణం చేపట్టినకలెవెల పాళెం వంటి గ్రామాల రోడ్లు కూడా తాత్కాలికమైన రోడ్లే శాశ్వతమైనవి కావు. జిల్లాలోని పలు గ్రామాల కనెక్టివిటీ రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారై గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నరక కూపాలుగా తయారైన రోడ్లను ప్రభుత్వం స్పందించి రోడ్లను త్వరితగతిన రిపేర్లు,నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సూచనలతో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జనరల్ సెక్రెటరీ గురుకుల కిషోర్ నెల్లూరు రూరల్ మండల ప్రెసిడెంట్ కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, ఐటీ వింగ్ సభ్యుడు అనుదీప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, 33 వ డివిజన్ జనసేన నాయకులు రాజా తదితరులు పాల్గొన్నారు.