
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో కట్టడి చర్యల్లో, బాధితులకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన జనసైనికుడు శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు ఆరోపించారు. కష్టకాలంలో ప్రజలకు కావాల్సింది 5 కేజీల బియ్యం కాదని ప్రతి కుటుంబానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లిలో కోవిడ్ విజృంభణ నేపధ్యంలో స్థానిక ప్రైవేట్ కళాశాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు. పాజిటివ్ నిర్ధారణ అయ్యి హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న వారికి ప్రభుత్వమే ఐసోలేషన్ కిట్టు ఉచితంగా అందచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో బ్లీచింగ్, శానిటైజింగ్ చేయించాలని డిమాండ్ చేశారు.