జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, సందీప్ పంచకర్ల సమక్ష౦లో యువతతో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ
జనసేన నాయకులు జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జనసేన భీమిలి ఇంచార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల గారు యువతతో సమకాలీన రాజకీయాలు, కోవిడ్ అంశాలు, జనసేవ కార్యక్రమాలు, విద్యా వ్యవస్థపై సుమారుగా ౩ గంటల పాటు వీడియో కాన్ఫెరెన్స్ లో మీటింగ్ జరిగింది. అందులోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
- జనసేన పార్టీ యువత నుంచి బలమైన నాయకత్వాన్ని ఆశిస్తుంది, అందుకే పార్టీ నిర్మాణంలో యువతను ప్రధాన భాగస్వామిగా తీసుకున్నాం.
- కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఏ పార్టీ చేయనన్ని సామాజిక కార్యక్రమాలు జనసైనికులు చేశారు. ప్రజాసేవలో ముందున్న జనసైనికులను చూస్తుంటే గర్వంగా ఉంది.
- జనసేన 5 సంవత్సరాల రాజకీయ పదవుల కోసం రాజకీయాలు చేయడం లేదు, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలనే దూరదృష్టితో ముందుకు వెళుతున్నాం.
- అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువత నుంచి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, సమస్యలు, సామాజిక అంశాలపై పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకునేలా పనిచేయాలి.
- జనసేన ఓడిపోయినా జనసేన సూచించిన విధానాలు నూతన విద్యా విధానంలో, జాతీయ నియామక సంస్థలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది.
- ఎంతోమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను త్యాగం చేశారు.
- వైద్యరంగంలో మౌలిక వసతులు కల్పించడంలో మన గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనేదానికి కరోనా ఒక ఉదాహరణ, చాలా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇప్పటికి కనీస సదుపాయాలు లేవు.
- ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించేందుకు పెట్టి ఉంటే, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బాగుపడు ఉండేది, కానీ నాయకులు కేవలం 5ఏళ్ల కోసం మాత్రమే చూసి వ్యవస్థను నాశనం చేస్తున్నారు.
- EBC రిజర్వేషన్ల విషయంలో జనసేన పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉండాలి అని జనసేన కోరుకుంటుంది.
- మంచి ఆలోచనతో ప్రజలను ఆదుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దమొత్తంలో రేషన్ కేటాయిస్తే కేవలం 70 శాతం మాత్రమే రాష్ట్రప్రభుత్వం తీసుకుని సగం కూడా ప్రజలకు అందించలేదు, ప్రజలకు అందించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
- జనసేన పార్టీ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ ను సంపూర్ణంగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో నాసిరకమైన ఉత్పత్తులతో ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న చైనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
- ఈరోజు ప్రపంచ దేశాలన్నీ చైనాను దూరం పెడుతున్నాయి, ఇదే సమయంలో మనం ఉత్పత్తిరంగంలో అభివృద్ధి చెందటం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ గా మనం బలపడచ్చు.
- ప్రభుత్వం ఈ క్లిష్ట సమయాల్లో మెడికల్ విద్యార్థులకు అండగా ఉండాలి, జూన్ నెలలోనే వారి సమస్యలపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు.
- కనీసం డాక్టర్లు, నర్సులకు PPE కిట్స్, మాస్కులు, ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలెండర్ కూడా అందుబాటులో ఉంచలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం.
- వచ్చే మార్చి వరకు ఉపాధి రంగంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ విద్యార్థులు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, మార్చ్ తరవాత అంతా సాధారణ స్థితికి వస్తుంది అని భావిస్తున్నాం.
- ఎవరికైనా కరోనా లక్షణాలు కల్పిస్తే భయపడకుండా టెస్ట్ చేయించుకోండి, త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాం.
- చిత్తూరు జిల్లా ఇతర రాష్ట్రాల సరిహద్దులో ఉంది, సరైన పెట్టుబడుల విధానం ప్రభుత్వం తీసుకురాగలిగితే ఇతర రాష్ట్రాల నుంచి చిత్తూరులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి.
- చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఉన్నా ఇప్పటికి చిత్తూరు జిల్లాని అభివృద్ధి చేయలేకపోయారు, యువతకు ఉపాధి కల్పించలేకపోయారు.
- చిత్తూరు జిల్లాలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టి సారిస్తే చిత్తూరు జిల్లాని పర్యటకంగా అభివృద్ధి చేయవచ్చు.
- భారతదేశ వ్యవస్థలో స్త్రీ పాత్ర ప్రాముఖ్యమైనది, స్త్రీ లపై జరుగుతున్న దాడులను అందరూ ఖండించాలి, ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడం మాత్రమే కాకుండా, వాటిని అమలుచేయడం ద్వారా నేరాలు తగ్గించవచ్చు.
- రైతులు ఎంతో కష్టపడుతున్నప్పటికి, రైతులకు వ్యవసాయశాఖ నుంచి పూర్తి సపోర్ట్ అందించడం లేదు, రైతులు గిట్టుబాటు ధర, సమాజంలో గౌరవం కోరుకుంటారు, కానీ ప్రభుత్వాలు అది కూడా కల్పించలేకపోతున్నాయి.
- రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు.
- చట్టాలు ఉన్నాయి, ఆఫీసర్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కానీ నేరాలు ఆగడం లేదు, ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రైతులు ఎంతో కష్టపడి పంటలు వేస్తుంటే, వర్షాలకు మునిగిపోతున్నాయి, వరదలకు కొట్టుకుపోతున్నాయి, ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో రైతులకు అండగా ఉండాలి.
- చిన్న, మధ్యతరహా సంస్థలను ప్రభుత్వం ఆదుకోవాలి, పెద్ద సంస్థలకు మాత్రమే కాకుండా చిన్న సంస్థలకు అండగా ఉండటం ద్వారా కొత్త కొత్త పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు.
- కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుండి సహకారం లభించడం కష్టం, అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా ఉంటే సరికొత్త ఆవిష్కరణలు వస్తాయి.
- పాలసీల్లో ఎప్పుడు 60 – 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుంది.
- ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చేలా ఉండాలి, ఒక ఫ్లాట్ ఫామ్ కల్పించేలా ఉండాలి, అంతేకాని పాలసీ సరిగా లేకుండా సబ్సిడీల ద్వారా మాత్రమే పెట్టుబడులు వస్తాయి అనడం సరికాదు.
- గత ప్రభుత్వం తీసుకొచ్చిన సన్ రైజ్ AP, పెట్టుబడుల సదస్సులు కేవలం ఫోటోలకు పరిమితం అయ్యాయి తప్ప, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఉపయోగపడలేదు.
- మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారని నేను రాజకీయాల్లోకి రాలేదు, ఖమ్మం జిల్లాలో ఒక NGO కోసం పనిచేసేప్పుడు, అక్కడ ప్రజల కష్టాలు చూసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను.
- ప్రజలు నిజాయితీగా పనిచేసే నాయకులని రాజకీయాలకు అతీతంగా ఎన్నుకోవాలి, ఎంత బాగా పనిచేసినా ఎన్నికల్లో ఓడిస్తే వ్యవస్థ మారదు.
- యువత రాజకీయాలను ఒక కెరీర్ గా తీసుకోవాలి తప్ప, పదవుల్లోకి వచ్చి కార్లు కొందాం, స్థలాలు కబ్జా చేద్దాం, కాంట్రాక్టులు తీసుకుందాం అని చూడకండి, అలా అయితే రాజకీయాల్లోకి రాకండి.
- యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోండి, ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత మన జీవితాల్లో భాగం అయిపోయింది, యువత వ్యవస్థలో కీలకం అవ్వాలి.
- ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనేది వదిలేసి మనమే ప్రభుత్వాన్ని పట్టించుకోవడం మొదలు పెట్టాలి.
- కరోనా సమయంలో ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేసింది, వ్యవస్థలో ఎటువంటి మార్పు రావాలి అన్నా సరే యువత బలంగా నిలబడాల్సి ఉంటుంది.
- RTI అనేది సామాన్యుడికి ఒక ఆయుధం, ప్రజలు దాన్ని వినియోగించుకోవాలి.
- తిట్లీ తుఫాన్ సమయంలో పర్యటించినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాజు బోర్డ్ పలాసలో ఏర్పాటు చేయాలని కోరాం, స్థానిక రైతులు ఏదైనా నిర్ణయంతో ముందుకు వస్తే జనసేన ఖచ్చితంగా జీడీ రైతులకు అండగా ఉంటుంది.
- ఈరోజు మిషన్ భగీరథ అని ఏదైతే చెప్తున్నారో, గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్నప్పుడు UNICEF తో కలిసి 600 కోట్లతో నల్గొండ లో ఫ్లోరోసిస్ అరికట్టడానికి రక్షిత మంచినీరు ఏర్పాటుకు కృషిచేసాను.
- ప్రకాశం జిల్లా ఫ్లోరోసిస్ సమస్య గురించి గతంలో ఎన్నోసార్లు మాట్లాడను, ఆ సమస్య క్షేత్రస్థాయిలో పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
- కరోనా అనేది ఎవరూ ఊహించని పరిణామం. రెండవ ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచ దేశాలన్నీ ప్రభావితం అయిన సమస్య కరోనా, ముఖ్యంగా 98% విద్యారంగం ప్రభావితమైంది.
- ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ ఎలా ఓపెన్ చేయాలి అనే దానిపై చూస్తున్నాయి, సామాజిక దూరం పాటించడం ప్రధాన సమస్య, వ్యాక్సిన్ వచ్చేవరకు పూర్తిస్థాయిలో ఈ సమస్య పరిష్కారం దొరకడం కష్టం.
- శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తరువాత సుగాలి ప్రీతి ఇష్యూ సీబీఐ కి ఇవ్వడం జరిగింది, ఇంకా విచారణ మొదలవ్వలేదు, త్వరలోనే సీబీఐ విచారణ మొదలవుతుంది అని ఆశిస్తున్నాను.