
ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమంలో భాగంగా వైజాగ్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అక్రమంగా నిర్బంధించి మరియు అక్రమంగా జనసేన నాయకులను అరెస్ట్ చేయడం చూస్తుంటే మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనిపిస్తుందని నాగులుప్పలపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు భూపతి మురళి మోహన్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం పబ్బం గడుపుతున్న ఈ జగన్ రెడ్డి కీ ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని, ఈ జగన్ రెడ్డి కీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ధ్యాస లేదు ఉన్న ధ్యాస అంతా ఒకటే ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ, వారిని ఇబ్బంది పెట్టడమే పని గా పెట్టుకున్నారు. ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం లో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం లో రైతన్నకు భరోసా లేదు, మహిళలకు భద్రత లేదు, యువతకు భరోసా లేదు, అలాంటి ఈ తరుణం లో ప్రజా సమస్యల పై పోరాడుతూ ప్రజల్లో ఆదరణ పొందుతున్న జనసేన పార్టీని చూసి ఓర్వలేక ఎక్కడికి అక్కడ జనసేన నాయకులు మీద, కార్యకర్తల మీద, వీర మహిళల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఉత్తరాంధ్రలో అరెస్టు చేసిన జనసేన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షం లో అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని అన్నారు.