అనంతపురము ( జనస్వరం ) : అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు చెప్పడం పరిపాటిగా మారింది. ఎప్పుడు చూసినా రూ.800 కోట్లతో నగర అభివృద్ధి చేశానని చెబుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నడిమి వంక సైడ్ వాల్ నిర్మాణం ఏమైందంటే సమాధానం చెప్పేందుకు నాలుక కరుచుకుంటున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు ఘాటుగా స్పందించారు. శుక్రవారము ఆయన నడిమి వంక పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నడిమి వంకకు సైడ్ వాల్ లేకపోవడంతో గత రెండేళ్ల క్రితం వచ్చిన వరదలకు అనేక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. ఆ సమయంలో చేస్తామన్న రూ రెండు వేల ఆర్థిక సహాయం కూడా ఇంతవరకు చేయలేదని కాలనీవాసులు తమ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే సైడ్ వాల్ నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు పూర్తయింది. మీ పదవీకాలం ముగిసేందుకు మరో రెండు నెలల సమయం కూడా లేదు. ఇంకెప్పుడు ఇచ్చిన హామీని నిలుపుకుంటారని వరుణ్ ప్రశ్నించారు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యే వైసిపి ప్రభుత్వంలో ఇలాంటివి సాధ్యం కావని చిత్తశుద్ధి కమిట్మెంట్ కలిగిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ గారు చెబుతున్న విధంగా జనసేన టిడిపి ప్రజా ప్రభుత్వంలోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. జనసేన టిడిపి అధికారంలోకి రాగానే నడిమి వంక సైడ్ వాల్ నిర్మించి తీరుతామని నడిమి వంక పరివాహక ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందని శ్రీ టి.సి.వరుణ్ గారు భరోసా ఇచ్చారు. పర్యటన సందర్భంగా ఓ వృద్ధుడు జగనన్న లేఅవుట్ లో తనకిచ్చిన పట్టాలు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే దీన్ని పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని శ్రేణులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com