వైసీపీకి మళ్లీ ఛాన్సు ఇచ్చే పరిస్థితి లేదు
*పాలకుల దాష్టీకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు
* భవిష్యత్తు జనసేన పార్టీదే
* సంతనూతలపాడు నియోజకవర్గం జనసేన కార్యకర్తల సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రకాశం, (జనస్వరం) : రాజకీయాల్లో సంపాదించాల్సింది ఆస్తులు, అంతస్థులు కాదని... అభిమానం, గౌరవం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైసీపీ నాయకుల దాష్టీకాలు, అరాచకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, మళ్లీ ఛాన్సు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనజెండా ఎగరడం ఖాయమని, ప్రకాశం జిల్లాలోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో
సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతం నుంచి యువత వలసలు వెళ్లిపోవడం చాలా బాధనిపించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు గడిపోయింది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. వచ్చిన పారిశ్రామికవేత్తలను కూడా బెదించడంతో అవి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్తుపై బెంగతో వలసలు పోతున్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి, వారికి అండగా ఉండేందుకు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. వైసీపీ నాయకుల్లా అధికారం రాగానే దోచుకోవడానికి కాదు" అని అన్నారు.
* చిత్తశుద్ధి, నిజాయతీనే వారిని గెలిపించింది
"మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వారందరూ కూడా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎన్నికల్లో నిలబడి చిత్తశుద్ది, నిజాయతీతో ఇంటింటికి వెళ్లి ప్రదారం చేసి గెలిచారు. అక్రమ కేసులు, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా నిలబడినందుకే వాళ్లు ఈరోజు గెలిపొందారు. వీరే జనసేన పార్టీ భవిష్యత్తు నాయకత్వం. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరే విధంగా కృషి చేయాలి. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని దాష్టికాలకు దిగినా లొంగకుండా పోరాటం చేయండి. మేము మీకు అండగా ఉంటాము" అని అన్నారు.
* సంతనూతలపాడు నుంచి జనసేన అభ్యర్థే పోటీ చేస్తారు
పార్టీ నిర్మాణం అంచెలంచెలుగా జరుగుతోంది. పార్టీ ఏర్పాటు చేసిన ఏ కమిటీలో అయినా యువత, మహిళలకు పెద్దపీట వేయమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకు తగ్గట్టు కమిటీల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి ఈ సారి జనసేన అభ్యర్థే పోటీలో నిలబడతారు" అని తెలియజేశారు. పార్టీ నాయకులు కందుకూరి బాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.పాకనాటి గౌతంరాద్, జిల్లా నాయకులు సుంకర సాయిబాబు, మలగ రమేష్, చిట్టి ప్రసాద్, ముత్యాల కళ్యాణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com