కడప జిల్లా, బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో దళితులకు అప్పట్లో 1987లో అప్పటి గవర్నమెంట్ 1463 సర్వే నెంబర్లో 63 కుటుంబాలకు 5 ఏకరాల 5 సెంట్లు భూమిని ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి అక్కలరెడ్డిపల్లె మాదిగలకు ఇవ్వడం జరిగింది. జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో (SC) మాదిగలకు కేటాయించిన భూమిలో ఇప్పుడు స్థానిక గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చెయ్యడం జరిగింది. మా భూమిలో పట్టాలు ఇచ్చారని అక్కలరెడ్డిపల్లె గ్రామంలోని (SC) మాదిగలు 23 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య నారాయణ గారు మద్దతు గా పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపి ప్రభుత్వ చేష్టల వల్ల హైకోర్ట్ తో పలుమార్లు మొట్టి కాయలు తిన్నా ప్రభుత్వములో ఎలాంటి చలనము లేదు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.