Logo
Date of Publish : 19 March 2022, 4:35 am
Editor : Sake Naresh

పాలన చేతకాక ప్రజలపై పన్నుల భారమా ! అనంతపురం నగర అధ్యక్షులు పొదలి బాబురావు

    అనంతపురం, (జనస్వరం) : ప్రస్తుత పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాల నుంచి కరోనా బారినపడి నగర ప్రజల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయిన ఈ సమయంలో అభివృద్ధి ఏమాత్రం చేయని ఈ వైసీపీ ప్రభుత్వం నగరంలోని ప్రజల ఆస్తిపన్నుపై ఉక్కుపాదం మోపడం ఏమాత్రం సమంజసం కాదని జనసేన నగర అధ్యక్షులు బాబురావు పేర్కొన్నారు. ప్రజా క్షేమాన్ని గాలికి వదిలి వారి రక్త మాంసాలను అమ్మి ఖజానాకు డబ్బులు నింపమని పదేపదే ప్రజలపై మునిసిపాలిటి అధికారులతో ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ నగరంలో ఇంటి పన్ను కట్టని పక్షంలో తాగునీటి కనెక్షన్లు కట్‌ చేస్తామని, ఇంటికి తాళం వేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులు చూస్తుంటే నిజంగానే రాష్ట్రంలో మహిషి పాలన జరుగుతుందనే విధంగా ఉందన్నారు. ఓవర్‌ బ్రిడ్జ్‌ వర్క్‌ వలన నగరానికి నడిబొడ్డున ఉన్న కమలానగర్‌, సుభాష్‌ రోడ్‌లోని వ్యాపార సంస్థలు పూర్తిగా చతికిలపడిన విషయం పాలకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇదే విధంగా ప్రజలపై ఒత్తిడి తెస్తే ప్రజల పక్షాన నిలబడి మునిసిపాలిటీ వ్యవస్థను ముట్టడి చేయాల్సి వస్తుందని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com