విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 51వ డివిజన్ అధ్యక్షులు బత్తుల వెంకటేష్ ఆధ్వర్యంలో kbn college opposite శ్రీనివాస మహల్ పక్క రోడ్ నుండి ప్రారంభించి 51వ డివిజన్లోని కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటిటికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా అనేక సమస్యలు చెప్తున్నారు అని ముఖ్యంగా ఈ కొండ ప్రాంతంలో వర్షాకాలంలో కొండ రాళ్లు ఇళ్లమీద పడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని త్రాగునీరు సరిగా రావడం లేదని స్థానిక కార్పొరేటర్ అయినటువంటి రాజేష్ గారికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పథకాలు కుట్రపూరితంగా ఏ విధంగా తొలగిస్తున్నారో కూడా మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న ఇంటి స్థలం రెండు అడుగులు ఎక్కువగా ఉందని సాకుతో పెన్షన్ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చెయ్యడం జరిగినది అని అదే విధంగా రెండు రోజుల నుండి స్తువర్తపురం దొంగలులాగా మెడలో బ్యాగ్లు తగిలించుకుని ఈ వైసిపి నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతు ఇళ్ళకి స్టికర్స్ అతికిస్తునారు అని ప్రజలందరూ తమ పథకాలు ఎక్కడ రద్దు చేస్తారో అనే భయంతో స్టిక్కర్లు తమ ఇళ్ళకి అతికించుకోవడం జరుగుతుందని ఎవరు కూడా జగనన్న స్టిక్కర్లు అతికించుకోవడానికి ఇష్టపడడం లేదని జగనన్నే మా దరిద్రం అని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇంటి పన్నులు పెరిగిపోయాయని, చెత్త పన్ను వేస్తున్నారని, గ్యాస్ ధరలు నిత్యవసరదరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి ఎందుకు అవకాశం ఇచ్చామా అని బాధపడుతున్నారని వారికి ఇదే చిట్టచివరి అవకాశాం అని వైసిపి ప్రభుత్వం ఇక ఈ రాష్ట్రంలో కనపడదని రాబోయే ఎన్నికల్లో వైసిపి విముక్తి ఆంధ్రప్రదేశ్ని ప్రజలందరూ కూడా చూస్తారని అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు స్టికర్ వేసే కార్యక్రమం ఆపాలని జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చెసే ఈ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంమా లేక వైసిపి ప్రచార కార్యక్రమంమా సమాధానం చెప్పాలని , తమ ప్రచార కార్యక్రమంలో వాలంటీర్లను, రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించి ప్రజాధనం వృధా చేస్తున్నారు అని అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి అని ఫీజు రిమెంబర్స్ మెంట్ కి తూట్లు పొడవడం తో పాటుగా రెండు విడతలు మూడు విడుదల గా చెల్లించడం వల్ల బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకి దూరమై అప్పులు చేసి T.C లు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారని, పెళ్లి కానుక, ఆదరణ పథకాలను రద్దు చేశాడని బీసీలను కేవలం ఓటు బ్యాంకుకే ఉపయోగించుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మాట్లాడం జరిగింది.
డివిజన్ అధ్యక్షులు బత్తుల వెంకటేష్ మాట్లాడుతూ కొండపై భాగంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, పింఛన్ వాల్స్ కట్టడం లేదని ,వాటర్ ట్యాంక్ వద్ద మట్టి పేరుకుపోయిన తీయడం లేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అందుబాటులో లేనందువలన ఎలుకలు నివాసంగా చేసుకొని మట్టిని తవ్వుకుంటూ ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయని, పడాల వారి వీధిలో మురుగునీరు సరిగా పడకపోవడం వలన గోడలకు చెమ్మ వచ్చి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తుందని ఇదే సమస్య తమ్మిన కొండలు వీధిలో కూడా ఉందని స్థానిక కార్పొరేటర్ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తద్యమని మహేష్ గారిని గెలిపించేందుకు అన్ని రకాలుగా కష్టపడతామని తెలియజేశారు. చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి నేమాని సంజీవరావు మాట్లాడుతూ ఏదో ఒక వంక చెబుతూ పెన్షన్లు రద్దు చేస్తున్నారని బీమా పథకం అమలులో లేకపోవడం వలన పేద సామాన్యులు పరిహారం అందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇకనుంచి అయినా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ పనిచేయాలన్నారు. కృష్ణా పెన్న మహిళా కమిటీ సభ్యురాలు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ గడ్డ పోతిన మహేష్ అడ్డ అని, అడుగడుగునా సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారని పావు కిలోమీటర్ నడవడానికి మూడు గంటలు పడుతుందంటే సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని, జనసేన పార్టీ పైన పోతిని మహేష్ గారి పైన విమర్శలు ఆపి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, సిగానంశెట్టి రాము, పొట్నరి శ్రీనివాసరావు, మల్లెపు విజయలక్ష్మి, ఏలూరు సాయి శరత్, బొమ్మ రాంబాబు,వెన్న శివశంకర్, స్టాలిన్ శంకర్, బోట్టా సాయి, పాల రజిని, పులి చేరి రమేష్ గారు,పోతిన వెంకటేష్, అడ్డగిరి పుల్లారావు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.