Logo
Date of Publish : 14 July 2022, 4:40 pm
Editor : Sake Naresh

గ్రామాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వానికి పట్టదా? ఎమ్మిగనూరు ఇంఛార్జ్ రేఖ గౌడ్

       ఎమ్మిగనూరు, (జనస్వరం) : అధికార వైసిపి పార్టీ గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ రేఖ గౌడ్ విమర్శించారు. పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్, కందినాతి, గ్రామాల్లో పర్యటించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా సరైన సౌకర్యాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామ ప్రజలను కేవలం వాళ్ల అవసరాలకు వాడుకుంటూ కేవలం ఓటర్లుగానే భావిస్తున్నారని విమర్శించారు. గుడికల్, కందనాతి, గ్రామాల్లో తాగునీటి సమస్యలు రహదారుల సమస్య డ్రైనేజీ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నపటికీ నిమ్మకు నీరెత్తినట్లు వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని ఇప్పటికైనా అధికార పార్టీలొ మార్పు రాకపోతే మా జనసేన పార్టీ తరఫున గ్రామ సమస్యపై పార్టీ కార్యకర్తలగా పోరాటానికి సిద్ధంగా వున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, గుడికల్ గోరంట్ల, హనుమంతు, కందనాతి నరేంద్ర, ధర్మ, షబ్బీర్, రమేష్, రషీద్, గుడికల్ కందనాతి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com