ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం చాలా దారుణంగా ఉందని ఆనంతపురం జిల్లా జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ రెండో దశ కోవిడ్ చాలా ఉధృతంగా ఉన్న తరుణంలో ప్రజలకు ఏ విధంగా ఆక్సిజన్ అందించాలి, ప్రభుత్వ ఆస్పత్రిలో ఏవిధంగా వైద్య సదుపాయం కల్పించాలని చర్చ జరగకుండా కేవలం సీఎం గారిని పొగుడుతూ కనీసం మాస్కులు ధరించకుండా మీరు రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బాధ్యతగా వ్యవహరించవలసిన మీరే బాధ్యతగా అసెంబ్లీలో ప్రవహించకపోతే? ప్రజలు ఏ విధంగా బాధ్యత ప్రవర్తిస్తారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడో దశ కోవిడ్ ఉదృతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ నిపుణులు చెబుతుంటే వాటికి కేటాయింపులు గాని వాటి గురించి సుదీర్ఘమైన చర్చ జరపకుండా... వాటికి సరైన కేటాయింపులు చేయకుండా కేవలం సీఎం గారికి భజన చేయడంతోనే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ప్రవర్తించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కేంద్ర పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ కేంద్రం కేటాయించిన వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించినట్లు చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది చాలా దారుణం బడ్జెట్ సమావేశం చాలా విచారణ కలిగించిందన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశంతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే తప్ప ప్రజలకు దీనివల్ల ఎటువంటి మంచి జరగదు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి... కరోనా సెకండ్ వేవ్ ను ఏవిధంగా కట్టడి చేయాలి, మూడో దశ ని ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచన చేయవలసిందిగా సూచిస్తున్నాం అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొద్దునిద్ర వీడి గొప్పలు మాని క్షేత్ర స్థాయిలోకి వచ్చి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అవినీతిని నిర్లక్ష్యాన్ని గమనించి ప్రజలకు మంచి చేయాలని సూచిస్తున్నాం. కరోనాతో దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలు చనిపోవడం జరిగింది కనీసం వారికి నివాళులు అర్పించి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాలేదా ? అని సూటిగా ప్రశ్నించారు.
వీటిని కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com