నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దుతామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు,కార్పొరేషన్ అధికారులు నెల్లూరును చెత్త నగరంగా మారుస్తున్నారని జనసేన నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు..నగర నియోజకవర్గంలోని, బారకాస్, కలెక్టరేట్, చిన్న బజార్, పెద్ద బజార్, ములుముడి బస్టాండ్ సెంటర్ పరిసర ప్రాంతాలలోని చెత్త కుండీల నిర్వహణను ఆయన పరిశీలించారు.. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ రేషన్ సరుకుల పంపిణీ కోసం 500 కోట్లు పెట్టి 9200 వాహనాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం, కార్పొరేషన్ పరిధిలో చెత్తను తొలగించేందుకు మాత్రం సరైన వాహనాలను కొనుగోలు చేయట్లేదని అన్నారు. కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించట్లేదని, అందువలన పనిలో నాణ్యత లోపిస్తుందని తెలిపారు.. రోజూ చెత్తను తీస్తున్నామని చెబుతున్న రోడ్లపై చెత్త అలానే ఉందని.. అధిక శాతం చెత్త కుండీలు పూర్తిగా పాడైపోయాయని, ఇనుప కుండీలు తుప్పు పట్టి పడిపోతే, ప్లాస్టిక్ కుండీలు పగిలి పోయి చెత్త రోడ్లపై స్వైర విహారం చేస్తుందని తెలియ చేశారు.. ఆ చెత్తను, కుక్కలు, ఆవులు చెల్లా చెదురుగా చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఈ చెత్త నిర్వహణ అద్వానంగా మారడంతో దోమల బెడద తీవ్రం అవుతోందని అన్నారు.. వెంటనే కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజల కోసం జనసేన పోరు బాట పడితుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,శ్రీకాంత్ యాదవ్, హేమంత్, వెంకట్, నాగ ప్రకాష్, మహేష్, సుధీర్, సమీర్, రవి, కోటేశ్వరరావు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com