Logo
Date of Publish : 08 February 2023, 3:09 am
Editor : Sake Naresh

ట్రాన్స్ఫార్మర్ అనుకొని శిలాఫలకం వేయడం అవసరమా?

- వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీసును కుట్రపూరితంగా కొట్టేయాలనుకోవడం నిజం కాదా?
- చిట్టి కాంగ్రెస్ ఆఫీసును, అమ్మవారి దొడ్డిని కొట్టేసి వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నారు.
       విజయవాడ, (జనస్వరం) : ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని శిలాఫలకం వేయడం అవసరమా? అని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట్ మహేష్ అన్నారు. మంగళవారం ఉదయం 53వ డివిజన్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని శిలాఫలకం వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఈ ప్రాంతంలో లారీలు మినీ లారీలు తిరుగుతూ ఉంటాయని, ట్రాన్స్ఫార్మర్ కు ఏదైనా రిపేర్లు చేయవలసి వస్తే శిలాఫలకం అడ్డంగా ఉందని, ఈ శిలాఫలకం ఏర్పాటు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని, అమ్మవారి దొడ్డిని తన బినామీల ద్వారా కుట్రపూరితంగా కొట్టేసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలనుకున్నారని, కానీ చిట్టి కాంగ్రెస్ పెద్దలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో అనేక ప్రభుత్వ భూములను కాజేసి తన ట్రస్ట్ లో కలిపేసుకున్నారని, వాటిలో భాగంగానే పురావస్తు, ఇరిగేషన్, కార్పొరేషన్, కార్మిక శాఖకు చెందిన భూముల్ని కబ్జా చేశారని ఇప్పుడు మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయం వంతు వచ్చిందన్నారు. ఇక్కడ కావాలని శిలాఫలకం వేశారని రోడ్డు చివరు వేస్తే వారికి వచ్చే ఇబ్బందేంటో వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com