Logo
Date of Publish : 15 December 2022, 3:55 pm
Editor : Sake Naresh

క్రాప్ హాలిడే లాగా అవినీతికి హాలిడేనా : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 213వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రోజుల పాటు అవినీతికి దూరంగా ఉండాలని సీఎం జగన్ తమ మంత్రులకు హితవు పలికినట్లు వార్తలు రావడం చూస్తుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం అవుతోందన్నారు. రైతులకు కొన్ని సీజన్లలో ఉండే క్రాప్ హాలిడే లాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మంత్రులకు, ఎమ్మెల్యేలకు అవినీతి హాలిడే ప్రకటించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మితిమీరిన అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని కొల్లగొట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దివాళా తీసిందని, ఈ ప్రభుత్వ అవినీతికి ప్రజలు వేసారి పోయారని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకుని అవినీతి హాలిడే ప్రకటించడం కాదని అసలు అవినీతి అక్రమాలు లేని పారదర్శకమైన పాలనని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అటువంటి పారదర్శక పాలన అందించగల నిజాయితీపరుడు ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే సీఎం పవనన్నే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com