Search
Close this search box.
Search
Close this search box.

పెత్తనం చేస్తూ మా పైనే కేసులా? : ఏపీ శివయ్య

ఏపీ శివయ్య

              చిత్తూరు ( జనస్వరం ) : వైసీపీ నేతలు అధికారంలో ఉండి కూడా “పేదలకి- పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం” అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ.. పల్లకీ మోసే బోయీ వలె చిత్రీకరించి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, జనసైనికుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్న ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం రాచూరు గ్రామంలో జరిగిన గ్రామ దేవత శ్రీ మాణిక్య నాంచారమ్మ 11 వ వార్షిక జాతర మహోత్సవంలో పార్టీ మండల అధ్యక్షుడు కుమార్ గారి ఆహ్వానం మేరకు ఏపీ శివయ్య, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసీ ప్రసాద్, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు కోడి చంద్రయ్య గారు, తవణంపల్లి మండల అధ్యక్షుడు రాజశేఖర్ అలియాస్ శివ, పూతలపట్టు మండల అధ్యక్షుడు మనోహర్, ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం, యాదమరి మండల కార్యదర్శి వేముల పవన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్, ప్రభాకర్, వెంకటేష్, ప్రసాద్, మాధవ, జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వేలకోట్ల రూపాయలు గల వారు, దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా, 16 నెలలు జైలులో ఉండి, బెయిలుపై రాజ్యాంగ విరుద్ధంగా పాలన చే‌స్తున్న వ్యక్తి పేద ఎలా అవుతాడని అసలైన పెత్తందారు జగన్ అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం తమ ఆధీనంలో ఉంది కదా అని అధికార మదంతో విర్రవీగుతూ వైసీపీ నేతలు చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నించిన జనసైనికులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షార్హమైన, నేరారోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు రానున్న కాలంలో ప్రజలే తమ ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి తగిన గుణపాఠం చెబుతారన్నారు. జాతర వంటి ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలలో, పార్టీ సభ్యులలో ఐక్యతను, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అయితే అధికార పార్టీ మదంతో కొవ్వెక్కిన చర్యలకు పాల్పడుతుందని దీని సమైక్యంగా నిలదీస్తూ ఎదుర్కోవాలని జన సైనికులకు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న అంతర్ రాష్ట్ర రోడ్లు అధ్వానంగా ఉండడాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రోడ్లు మరమ్మతులు చేపట్టి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కార్తీక్, రమేష్, సునీల్, శివ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way