గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న సందర్భంలో భారతదేశంలో తయారు చేసి పేద దేశాలు మరియు మిత్ర దేశాలకు “వ్యాక్సిన్ మిత్ర” పేరుతో ఇప్పటి వరకు 75 దేశాలకు వ్యాక్సిన్ అతి తక్కువ రేటుకు అందించడం జరిగింది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా మోడీ గారి ప్రభుత్వ దౌత్యనీతి అదే విధంగా ఇతర దేశాలకు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కరోనాకు టీకా అందిస్తున్న తీరుకు భారత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో 40 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ని అందించడం జరిగింది. తద్వారా 10 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడం జరిగింది. భారత ప్రభుత్వం ఈ నెల 11 వ తారీకు నుంచి దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన “టీకా ఉత్సవ్” పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలందరికీ టీకా ఇవ్వటానికి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్బుద్ధితో కుటిల రాజకీయ మనస్తత్వంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టీకా కొరత ఉందని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరింది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రనికి 6లక్షల డోసుల వెంటనే పంపించింది.
ఉన్న వ్యాక్సిన్ డోసులు అన్నింటిని కూడా తనదైన శైలిలో D&MHO ల, ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా వ్యాక్సిన్ ఎక్కువగా ఉపయోగించడమే కాక వృధా చేయడం కూడా జరిగింది. కర్నూలు మరియు అనంతపురము జిల్లాల్లో 11వ తేదిన టీకా ఉత్సవ్ ప్రారంభం కాలేదు. తద్వారా రాష్ట్రంలో వ్యాక్సిన్ కృత్రిమ కొరతను సృష్టించారు. ICMR నియమ నిబంధనలు పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయించడం. కొన్నిచోట్ల అధిక ధరలకు టీకాలకు వసూళ్లు చేయటం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు పొందుతూనే ఇటువంటి సంకుచిత మనస్తత్వంతో టీ ఉత్సవ కార్యక్రమాన్ని తక్కువగా చేసి రాష్ట్ర ప్రజల దగ్గర కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిగా అందించడం లేదని దుష్ప్రచారం చేయటానికి తద్వారా తిరుపతి ఉప ఎన్నికలలో లబ్ధి పొందడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నది. కరోన మహమ్మారి రాష్ట్రంలో విస్తృతంగా విజృంభించినపుడు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని సహకారం పొందిన తర్వాత ఇప్పుడు ఈ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ఒక వేల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో టీకా కొని ప్రజలకు వాయిస్తే ప్రజలు అభినందిస్తారు. అంతేగాని టీకా మందు నిర్వహన సరిగ్గా నిర్వహించలేక కేంద్ర ప్రభుత్వాన్ని టీకా అందించాలని కేంద్రనికి లేఖ రావడం సరి కాదు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో వ్యాక్సిన్ నిల్వలు ఆంధ్రప్రదేశ్లో లేనట్లు రాయలసీమ జిల్లాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడినట్లు ముఖ్యమంత్రి స్పందిస్తూ అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ మాకు వెంటనే వెంటనే అందజేయాలని లేఖ రాయడం ఉద్దేశాన్ని దీనివల్ల అర్థమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు వ్యాక్సిన్ లేదు అనే పేరుతో 11 వ తారీకు జరిగిన “టీకా ఉత్సవ్” కార్యక్రమాన్ని వ్యాక్సిన్ కొరత ఏర్పడినట్లు చూపించారు. కేంద్ర ప్రభుత్వం మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టిన “టీకా ఉత్సవ్” కార్యక్రమాన్ని అమలు చేయండంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తద్వరా రాష్ట్రంలోని ప్రజలు టీకా మందుకు ప్రజలను దూరం చేశారు. రాష్ట్ర మరియు దేశ ప్రజలకు మోడి ప్రభుత్వ పనితీరు, టీకా ను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని అందరికి తెలుసు. రాష్ట్రంలో టీకా ఉత్సవ్ గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ గారి దృష్టికి రాష్ట్ర బిజెపి తీసుకెళ్లుతుందని అన్నారు.