Logo
Date of Publish : 20 September 2022, 4:44 pm
Editor : Sake Naresh

అనిల్ కుమార్ యాదవ్ ముత్తుకూరు గేట్ బ్రిడ్జ్ సొంత డబ్బులతో కట్టిస్తున్నాడా? ప్రగల్భాలకు హద్దుండాలి : చెన్నారెడ్డి మనుక్రాంత్

 నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ జనసేన పార్టీ క్రికెట్ టోర్నమెంట్ లో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో ఎక్కడ చూసినట్లయితే కష్టాలు కన్నీళ్లు కనబడుతున్నాయి, కడుపు తరుక్కుపోతుంది వాళ్ళ కష్టాలు చూస్తు ఉంటే ఈ వైసిపి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు విలాసాలు అనుభవిస్తున్నారన్నారు.  అనిల్ కుమార్ యాదవ్ కూడా ముత్తుకూరు గేట్ బ్రిడ్జ్ సంవత్సరం లో పూర్తి చేయాల్సింది దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా కంప్లీట్ చేయకుండా చుట్టుపక్కల ఆపేసి ప్రజలు ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా మొన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను కట్టే బ్రిడ్జ్ మీరందరూ వెల్లాలి అంటున్నాడు మేము అడుగుతున్నాం మీరు ఎలా కడుతున్నారు. బ్రిడ్జ్ మీరు ఏమన్నా సిమెంట్,కంకర, ఇటుకలు మోసి కడుతున్నారా లేేక మీ జోబులో డబ్బులతో కడుతున్నారా ? అని ఫైర్ అయ్యారు. మా టాక్స్ రూపంలో కట్టిన డబ్బులతో ఆ బ్రిడ్జ్ కడుతున్నారు. మీ వైఫల్యం వల్ల మీ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్ల ఈరోజు ప్రజలందరూ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎటు సైడ్ నుంచి వెళ్లాలనేది కూడా తెలియకుండా డైవర్షన్స్ బోర్డ్స్ కూడా పెట్టకుండా అంటే ప్రజలు కష్టాలు పడుతున్నారు అంటే, మీరేదో వెటకారంగా ఒక తమాషాలాగా చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కష్టాలు కన్నీరే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు వాగ్దానం చేశారు ఇప్పుడు ఆవన్నీ గాలికి వదిలేసారు.బ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి నెల్లూరు ప్రజలకు ఏం చేసారని ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. ఈసారి మీకు తిరగడానికి కూడా ఉండదు డిపాజిట్లు కూడా రావు అని నెల్లూరు సిటీలో ప్రజలు గట్టిగా చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com