చెల్లూరు ( జనస్వరం ) : తమ గ్రామ సమస్యలు పరిష్కరమే ధ్యేయంగా చెల్లూరు గ్రామంలో "ఇంటింటికి జనసేన" ప్రచార కార్యక్రమానికి చెల్లూరు జనసేన నాయకులు శ్రీకారం చుట్టారు. బుధవారం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి చెల్లూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జనంలో చైతన్యం తీసుకొచ్చి, ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, రాయవరం మండల అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, MPTC గొల్లపల్లి వెంకటరమణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com