
పటాన్ చెరువు ( జనస్వరం ) : ఇస్నాపూర్ జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశం తదనంతరం ఇంచార్జ్ రాజేష్ యడమ సమక్షంలో పార్టీలోకి చేరికలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పటాన్ చెరువు నియోజకవర్గంలో పార్టీని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్లడం దిశా నిర్దేశం చేశారు. జనసేనపార్టీ కోసం మరింత కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసే విధంగా ప్రజల్లో కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు జన సైనికులు భారీగా పాల్గొన్నారు.