Logo
Date of Publish : 21 February 2022, 1:29 pm
Editor : Sake Naresh

పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు మత్స్య పుండరికం గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు

    పాలకొండ, (జనస్వరం) : అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వీరఘట్టం మండలం నడుకూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సరస్వతి దేవి విగ్రహం, తెలుగు తల్లి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మత్స పుండరికం మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మననది - మననుడిలో భాగంగా అంతరించిపోతున్నయని, వాటిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. మాతృభాషతోనే విజ్ఞానాభివృద్ధి జరుగుతుంది. మన సాంస్కృతి, ఆచారం, కుటుంబ పద్ధతులు అన్ని మాతృభాషలొనే అర్ధం చేసుకోగలం. పరాయి భాష మోజులో పడి మాతృభాషను చిన్నచూపు చూడకూడదు. మన మాతృభాషను ప్రతిఒక్కరు రక్షించుకోవాలని జనసేన పార్టీ మండల నాయకులు మత్స పుండరీకం అన్నారు. అంతకుముందు విద్యార్థులకు మననుడి - మనబడి, మన మాతృభాష - తెలుగు భాష అంశాలపై 6,7,8,9, తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు పోటీలో పాల్గొన్న విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటు మురళి, సాధు విశ్వేశ్వరరావు, కర్ణేన పవన్ సాయి, వావిలపల్లి నాగభూషణం, దత్తి గోపాలకృష్ణ, వావిలపల్లి విస్సు, వాన కైలాష్, వాన మహేష్, కలిపిల్లి సింహాచలం, రౌతు గోవింద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com